నీకు నువ్వు తెలుసా?

.
వ్యవహారానికి లౌక్యం కావాలని తెలుసు
వ్యాపారానికి లొసుగులు తెలియాలని తెలుసు
కూటి కోసం కోటి విద్యలున్నాయని తెలుసు
ఆటలో గెలుపు ఒకరిదేనని తెలుసు
.
నీటిలో రాయి ములుగుతుందని తెలుసు
గూటిలో పిట్ట ఎగురుతుందని తెలుసు
అవతలి వారిలో తప్పులేంటో తెలుసు
ఎవరితో ఎంతవసరమో తెలుసు
.
నిన్నని రమ్మన్నా రాదని తెలుసు
రేపన్నది ఒక నమ్మకమే అని తెలుసు
ఓడితే వచ్చే ఇక్కట్లు తెలుసు
గెలిస్తేనే చప్పట్లని తెలుసు
.
కానీ!
.
ఎంత తెలిసినా ఇంకా ఉందని తెలుసా?
అడుగు వేస్తేగాని పరుగు మొదలవదని తెలుసా?
లోకాన్ని గెలవాలంటే ముందు నిన్ను గెలవాలని తెలుసా?
ఒక్క మాటలో అడగాలంటే నీకు నువ్వు తెలుసా?
.
తెలిస్తే?
.
నీకు నువ్వు తెలిస్తే
గమ్యం స్పష్టమౌతుంది
కష్టం ఇష్టమౌతుంది
మనసు నీ మాట వింటుంది
మృత్యువులో కూడా ఆనందం ఉంటుంది
.
…………….నిన్ను నువ్వు తెలుసుకో…..నీలోని ప్రపంచాన్ని గెలుచుకో
.

The URI to TrackBack this entry is: https://naagola.wordpress.com/2009/12/18/%e0%b0%a8%e0%b1%80%e0%b0%95%e0%b1%81-%e0%b0%a8%e0%b1%81%e0%b0%b5%e0%b1%8d%e0%b0%b5%e0%b1%81-%e0%b0%a4%e0%b1%86%e0%b0%b2%e0%b1%81%e0%b0%b8%e0%b0%be/trackback/

RSS feed for comments on this post.

14 వ్యాఖ్యలువ్యాఖ్యానించండి

  1. చాలా బాగా రాశారు.

  2. nice one boss, chala baga chepparu

  3. well said

  4. బాగుందండి. ఇదినిజం. ముందు మనల్ని తెలుసుకుంటేనే కదా ఇంకేదైనా!

  5. నేను కవితలు అర్ధం కావులే అని చదివే ప్రయత్నం చెయ్యను. టైటిల్ చూసి చదవాలనిపించింది. చాలా బాగా వ్రాసారు. నిజం వ్రాసారు. అర్ధం కాకపోవడానికి ఏమీ లేదు. గ్రేట్ రైటప్!

    • మీ అభిప్రాయం తెలియజేసినందుకు ధన్యవాదములండి. మీ పేరు తెలుసుకోవచ్చా?

  6. వెంకట రమణ గారు, హర్ష గారు, హను గారు, జయ గారు… మీ వ్యాఖ్యలకు ధన్యవాదములండి

  7. saralamyna baashalo baagaa raasaru

    • మీ వ్యాఖ్యకు ధన్యవాదములండి ఉమ గారు.

  8. మీ కవితలతో మమ్మల్ని మాకు దగ్గర చేస్తున్నారు…
    అద్భుతం.

  9. శ్రీ రాజన్ గారికి, నమస్కారములు.

    కవిత చాలా చాలా బాగుంది. నాలొ వున్నది, మీలో వున్నదీ ఒకటే, అదే, కవితా హృదయం అని తెలుసుకున్నాను. ఆ రసమయ లోకంలోనే మనం వున్నాం.

    భవదీయుడు,
    మాధవరావు.

    • అవునండి. మీ వ్యాఖ్యకు ధన్యవాదములు మాధవరావు గారు

  10. Aaai ……………..
    Entaki nenu evarini andi ?
    Guruvu garu meeku telesthe cheppandi …………… telesukuntanu.

    Danyavadamulu……….

    Bavadiyudu,
    Aagnani.

  11. Aaai,

    Entaki nenu evarandi ………………

    Guruvu garu………………………..Meeku telsithe cheppandi, telusukuntanu.

    Danyavadamulu,


వ్యాఖ్యానించండి