నెలరాజు నగవులు సెలయేటి పరుగులు
కలగలసి వెలిగేటి తెలుగింటి పదములు
రామచిలుకలు మెచ్చు రసరమ్య పలుకులు
అప్సరల భంగిమల అక్షర క్రమములు || అప్సరల||
అ అనగ అమ్మనుచు ఆ అనగ ఆవనుచు
తొలిపూజనీయులే తొలుత పదములు కాగ
సంస్కారవంతమగు ఈ భాష నీ భాష
చివురాకు రెపరెపల మన తెలుగు భాష || చివురాకు ||
అవధాన విద్యయును అందాల పద్యమును
సొంతమగు సరళమగు అపురూప భాష
అర్చింపగానిట్టి అమృతమయ భాషను
నర్తింపనీవోయి నీ నోట తెలుగును || నర్తింపనీవోయి ||
ప్రకటనలు