ఓ ప్రియురాలా..

.
ఓ ప్రియురాలా… నీవెంత కఠినాత్మురాలవు
....నిర్ధాక్షిణ్యంగా  నను ప్రేమలో ముంచేసి
ఆ ప్రేమ అలల తాకిడిలో ఊపిరాడని నన్ను చూసి
....ముసి ముసి నవ్వులు నవ్వుతున్నావా!
.
బంతిపూల వనం నుండి బయటకు రాలేక
....చక్కర్లు కొట్టే సీతాకోకచిలుకలా
నను నీ తలపుల తోటలో బంధీని చేసి
....సంబరపడుతున్నావా!
.
ఇంత విశాల ప్రపంచంలో మరెక్కడా చోటే లేనట్టు
....చిన్నని నా హృదయంలో దూరి
గుండె చప్పుడును లాలిపాటగా మార్చుకుని
....నిద్రపోతున్నావా!
.
ఓ ప్రియురాల..
....నా మనసుకు ఊసువై మేనుకు శ్వాసవై
నేను నువ్వై నువ్వే ఆనందమై.. నన్ను జయించావా!
....నాకోసమే జన్మించావా!.
.
ప్రకటనలు

నా ప్రేయసి ఎవరంటే…

.
తన నా కళ్ళకు మాత్రమే కనపడే అందాలరాశి
జక్కన చెక్కిన శిల్పంలా ఉండే సౌందర్యవిలాసి
హరివిల్లునెక్కి హరిణాలతో ఆటలాడు క్రీడోల్లాసి
ఒక్కమాటలో చెప్పాలంటే తన నా ఊహా నివాసిప్రేయసి

.
ఆకాశంలో మెరుపులు
సిగ్గుపడి మాయమయ్యాయి
నా ప్రేయసి నవ్వులో మెరుపు చూసి
.
జాబిలి ఇంకో జాబిలి ఉందా!
అని విస్తుపోయింది
నా ప్రేయసి వదనపు కాంతి చూసి
.
కలువరేకులు తమ అందాన్ని
తామే తిట్టుకున్నాయి
నా ప్రేయసి నయనాల తీరు చూసి
.
సౌందర్యజలపాతం
సొంపుగా నవ్వింది
నా ప్రేయసి మేను ఒంపు చూసి
.
ముగ్ధమోహన మయూరం
క్రొత్త నడక నేర్చింది
నా ప్రేయసి నడకలో హొయలు చూసి
.
ఝుమ్మంటూ తుమ్మెద
తేనెకోసమొచ్చింది
నా ప్రేయసి శరీర సుగంధం చూసి
.
దేవకాంత ఊర్వశి
తూలి పడిపోయింది
నా ప్రేయసి అణువణువులో ఉన్న సొగసు చూసి