రెండు ముక్కల్లో మూడు వాక్యాలు

 
ఒకరికొకరు దగ్గరవ్వడమంటే.. ఎంతదూరం పాటించాలో తెలిసుండటం
 
జీవితం అంటే.. దారిలో దొరికిన పండుని కూర్చొని తినడం కాదు.. చెట్టునున్న నచ్చిన పండుని కోసుకు తినడం
 
లేనిదానిని సాధించడం వల్ల కలిగే ఆనందానికి అల్పాయుష్షు
అఖ్ఖర్లేనిదాన్ని వదిలించుకోవడం వల్ల కలిగే ఆనందానికి దీర్ఘాయుష్షు
.
ప్రకటనలు

రెండు ముక్కల్లో ధ్యానం

.
ధ్యానం అంటే బయటి కళ్ళు మూసుకోవడం కాదు లోపలి కళ్ళు తెరచుకోవడం
.

రెండు ముక్కల్లో భగవంతుడు

తనదికానిది అంటూ ఏదీలేని తనుకానిది అంటూ ఏదీకాని బ్రహ్మపదార్థమే భగవంతుడు

ఎక్కడుండేవారో? ఎలాఉండేవారో?

.
తాము వ్రాసేదంతా చేసేస్తే…రచయితలు ఎక్కడుండేవారో?
తాము చెప్పేదంతా ఆచరించేస్తే…ఉపన్యాసకులు ఎలాఉండేవారో?
.

వ్యసనం అంటే…

.
అంటించుకున్న దానిని వదిలించుకోలేకపోవడం
.

అవునా…అక్కడున్నాడా?

.
దేవుడు ఆకాశంలో కాదు..అద్దంలో ఉన్నాడు
.

గాడిదల్లో రకాలు

.
గాడిదలు రెండు రకాలు:
.
మొదటి రకం మూటలు మోస్తాయి
…….రెండో రకం మాటలు మోస్తాయి
.