.
నటనకు ముఖ్యంగా కావలసిన ఆహార్యము, అంగికము, వాచికము, సాత్వికము సమపాళ్లలో పోతపోస్తే వచ్చిన రూపమే ఎన్టీఆర్ ఏమో అనిపిస్తుంది. మాయాబజార్ కృష్ణుడు, లవకుశ రాముడు, పాండవ వనవాసం భీముడు, దానవీరశూరకర్ణ దుర్యోధనుడు, సీతారామకళ్యాణం రావణుడు, ఇలా నాయకులు, ప్రతినాయకులు అందరూ రామారావులే. అసలు దానవీరశూరకర్ణ సినిమా చూసిన తరువాత, ఒకవేళ నిజం దుర్యోధనుడు ఈ భూమ్మీదకు వచ్చినా నువ్వు నువ్వుకాదు ఎన్టీఆరే అసలు నువ్వంటావేమో. పాతాళభైరవిలో సాహసం చేసే డింభకుడిగా అలరిస్తే, కన్యాశుల్కం సినిమా చూసిన తరువాత గురజాడ వారి గిరీశం ఎలా ఉంటాడో ఊహించేసుకుంటాం. గుండమ్మకథ సినిమాలో సగం ఊడిపోయిన బొత్తాలున్న చొక్కా, పొట్టి నిక్కరు వేసుకున్న అంజిగాడు కనపడతాడు తప్ప ఎన్టీఆర్ కనిపించడు. పురాణ పాత్రలు వేసేటప్పుడు కాళ్ళకు చెప్పులు వేసుకోకపోవడం, మాంసాహారం తినకపోవడం, నేలమీదే నిద్రించడం ఆయనకు తను ధరించే పాత్రల మీద ఉన్న గౌరవానికి, నిబద్ధతకు ఉదాహరణలు. ఆయన నటించిన సినిమాలు తెలుగు సినీ నటులందరికీ గ్రామర్ పుస్తకాల్లాంటివి. సుమారు మూడు నూర్లు సినిమాలలో నటించిన ఈ నటరత్నానికి లభించిన అవార్డులు మాత్రం లెక్కకు చాలా తక్కువ. తెలుగు కథానాయకులలో దాదాసాహెబ్ ఫాల్కేలు, పద్మభూషణ్ లు పొందిన నటులందరూ ఎవరిని మహానటుడని పొగుడుతుంటారో అటువంటి ఎన్టీఆర్ కి మాత్రం ’పద్మశ్రీ’ తోనే సరిపెట్టేసింది కేంద్రప్రభుత్వం. ఆయన రాజకీయవేత్తకూడా కావడమే ఇందుకు ప్రబలమైన కారణం కావచ్చు.
.
భారతదేశంలో కేవలం ఇద్దరే ఇద్దరు నటులు అటు సినిమారంగం లోను. ఇటు రాజకీయరంగం లోను తారాపథాన్ని అందుకున్నారు. వారిలో ఒకరు తమిళుల అన్న ఎమ్జీయార్ కాగా ఇంకొకరు తెలుగువారి అన్న ఎన్టీఆర్ . సినిమా కృష్ణునిగా ధర్మసంస్థాపనకోసం అవతరిస్తానని అభయం ఇచ్చిన ఎన్టీఆర్ , ’తెలుగుజాతి ఆత్మగౌరవం’ నినాదంతో రాజకీయ అవతారం ఎత్తాడు. తెలుగుదేశాన్ని స్థాపించి రాజకీయాల్లో నెలల బాలుడిగా ఉండగానే ముఖ్యమంత్రి అయ్యాడు. ఆడవారికి ఆస్తిలో వారసత్వపు హక్కు, కిలో రెండురూపాయిల బియ్యం, మద్యపాన నిషేదం, ట్యాంక్ బండపై తెలుగు మహామహుల విగ్రహ ప్రతిష్ట, పద్మావతీ మహిళా విశ్వవిద్యాలయ స్థాపన మొదలైన కార్యక్రమాలు అతని ఆచరణశీలత్వానికి ప్రతీకలు. కానీ రంగుల బురదవంటి రాజకీయాల్లో ప్రవేశించిన తరువాత బుద్ధికి బురద అంటక మానదు. కొందరు రంగుని చూసి మురిసిపోతుంటే, ఇంకొందరు బురదను చూసి ఛీత్కరించుకుంటారు. ఈ పరిస్థితికి ఎవ్వరూ అతీతులు కారు. ఎన్టీఆర్ వ్యక్తిగత జీవితంలో ఒడిదుడుకులూ, దగ్గరవారి రాజకీయ అవసరాలు కలసి అతనిని ముఖ్యమంత్రి పీఠం నుండి తోసివేసాయి. దశాబ్ధాలపాటు తెలుగు చలనచిత్రసీమని, ఏడేళ్ళపాటు తెలుగు నేలని ఏకఛత్రాధిపత్యంగా ఏలిన ఎన్టీఆర్ అవమానకరరీతిలో పదవి నుండి ఆ తరువాత ఈ లోకం నుండి నిష్క్రమించాడు. గెలుస్తూ బ్రతికిన ఎన్టీఆర్ ఓడిపోతూ మరణించాడు. తెలుగులో ఎంతమంది గొప్పనటులు వచ్చినా తరాలు దొర్లినా ’మహానటుడి’ స్థానం మాత్రం ఆచంద్రతారార్కం తనకే సుస్థిరం చేసుకుని ఈ సినిమా రాముడు నిజం దేవుడి దగ్గరకు వెళ్ళిపోయాడు. .
ప్రకటనలు
చాలా బాగారాసారు. కథ పాతదే అయినా కథనం కొత్తగా ఉందన్నట్టు మీ శైలి బావుంది. “గెలుస్తూ బ్రతికిన ఎన్టీఆర్ ఓడిపోతూ మరణించాడు” ఈ లైన్ చదివినప్పుడు అయ్యో నిజమే కదా అనిపించింది.
మీ ప్రతిస్పందనకు ధన్యవాదములండి అనురాధ గారు
నేను 1974 రామరావగారిని అబిమానీ మీరు రామరావు గురించి చాలా బాగా రాసారు
రామారావుగారు నా అభిమాన నటుడు. చక్కని వ్యాసం వ్రాసారు. ప్రారంభం ముగింపు చాలా బాగున్నాయి.
మీ వ్యాఖ్యకు ధన్యవాదములండి శ్రీపతి శర్మగారు
చాలా బావుంది.
కృతజ్ఞతలండి చౌదరిగారు
Heloo Rajan garu.
Malii pata gynapakalani nemaravesukunela chesaru
Krishnudu ela untado teliyadhu kani aa mahatmudnii taraka ramaravu gari roopamlo choodachu
chala baga rasaru
Bhanu
అవునండి కృష్ణుడంటే ఎన్టీఆర్ తప్ప వేరొకరు గుర్తురారండి.
very good article Rajan garu..
మీ ప్రోత్సాహానికి ధన్యవాదములండి
Rajan, chalabaga rasavu.
Thank u Srikanth
People rarely ignore Gods in this speed life. But when Rama Rao historical pictures be watched they salute the God. We lost the God by his death.
A.MAHENDER. IPPAL NARSINGAPOOR 09390233228
రత్నాకర్ రాజమండ్రి
చాలా బాగుంది.
అందరి రాముడు ఈ నందమూరి తారక రాముడు.
ఎందుకో మహనీయుల గూర్చి చదువు తూ ఉంటె కళ్ళు చెమరుస్తాయి.
వారి జీవన శైలా? లేక మీ రచనా శైలా ?
ఏమైనా హృదయం బర్వెక్కింది బాధతో ..
–రత్నాకర్ , ఇందిరా దేవి , శ్రీ రామ్ , అభిరాం
రాజమండ్రి.
మీ స్పందనకు ధన్యవాదములండి రత్నాకర్ గారు
coorrect ga ntr gurinchi naa manassulo vunna abhipraayaalane meeru vyaktam chesaaru. santhosham