గుండె అన్నదీ కుండేనేమో

.

గుండె అన్నదీ కుండేనేమో

కన్నీళ్లతొ అది నిండాలేమో

బాధ బ్రతుకూ తావి విరులు

విడివడి ఎరుగని ఆత్మబంధువులు

.

చినుకు స్పర్శతో పులకించిన విరి

బ్రతుకు తోటలో విరబూసినది

పూసిన విరి ఆ చినుకును కానక

పూరెక్కలు ముక్కలై విలపించినది

.

వలచిన మనసుని గెలుచుట కోసం

మనసులొ మనిషిని చేరుట కోసం

కలల అలలపై పయనము చేసి

వ్యధల కడలిలో మజిలీ చేసా

.

నాదీ అన్నది మనిషికి లేదు

ప్రేమ అన్నది నిత్యం కాదు

చావూ పుట్టుక దైవాధీనం

కాలం ఆడే మాయాజూదం

.

ప్రకటనలు

The URI to TrackBack this entry is: https://naagola.wordpress.com/2011/04/23/%e0%b0%97%e0%b1%81%e0%b0%82%e0%b0%a1%e0%b1%86-%e0%b0%85%e0%b0%a8%e0%b1%8d%e0%b0%a8%e0%b0%a6%e0%b1%80-%e0%b0%95%e0%b1%81%e0%b0%82%e0%b0%a1%e0%b1%87%e0%b0%a8%e0%b1%87%e0%b0%ae%e0%b1%8b/trackback/

RSS feed for comments on this post.

13 వ్యాఖ్యలువ్యాఖ్యానించండి

 1. Heart Touching one. I enjoyed it a lot

  • మీ వ్యాఖ్యకు ధన్యవాదములు శిరీషగారు

 2. చాలాబావుంది.

  “గుండె అన్నదీ కుండేనేమో
  కన్నీళ్లతొ అది నిండాలేమో”

  “నాదీ అన్నది మనిషికి లేదు
  ప్రేమ అన్నది నిత్యం కాదు”

  ee lines extraordinary gaa unnay

  • స్రవంతి గారు మీ ఉత్సాహపూరిత వ్యాఖ్యకు కృతజ్ఞతలండి

 3. wah wa wah wa…gunde pindesaaru

  • మీ వ్యాఖ్యకు కృతజ్ఞతలండి మదన్ గారు

 4. బావుందండి రాజన్ గారు. చిన్న సందేహం ఇది కవిహృదయమా? మీ హృదయమా?

  • నా హృదయ వేదన కాదండి ప్రదీప్ గారు అది ఒక ఊహావేదన అంతే..

 5. Nice….

 6. బావుందండి!

  • ధన్యవాదములండి పద్మార్పిత గారు

 7. బాధ బ్రతుకు ను తావి విరి సంబంధంతో పోల్చి చాలాబాగా వ్రాసారు… ఎప్పుడో విన్న పాతపాట “పువ్వు విడిచి తావి నిలువ లేదులే అదీ నిజములే…..” గుర్తొచ్చింది. ముగింపు చాలా బావుంది. మీ మిగతా కవితలు కూడా ఈరోజే చదివాను, ఉత్తమస్థాయి భావకవితాశక్తి ఉంది మీలో. వ్రాస్తూ ఉండండి.

  • శ్రీపతి శర్మగారు…. మీ అభిమానానికి, ఉత్సాహానికి కృతజ్ఞతలండి


స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

%d bloggers like this: