ఓ ప్రియురాలా..

.
ఓ ప్రియురాలా… నీవెంత కఠినాత్మురాలవు
....నిర్ధాక్షిణ్యంగా  నను ప్రేమలో ముంచేసి
ఆ ప్రేమ అలల తాకిడిలో ఊపిరాడని నన్ను చూసి
....ముసి ముసి నవ్వులు నవ్వుతున్నావా!
.
బంతిపూల వనం నుండి బయటకు రాలేక
....చక్కర్లు కొట్టే సీతాకోకచిలుకలా
నను నీ తలపుల తోటలో బంధీని చేసి
....సంబరపడుతున్నావా!
.
ఇంత విశాల ప్రపంచంలో మరెక్కడా చోటే లేనట్టు
....చిన్నని నా హృదయంలో దూరి
గుండె చప్పుడును లాలిపాటగా మార్చుకుని
....నిద్రపోతున్నావా!
.
ఓ ప్రియురాల..
....నా మనసుకు ఊసువై మేనుకు శ్వాసవై
నేను నువ్వై నువ్వే ఆనందమై.. నన్ను జయించావా!
....నాకోసమే జన్మించావా!.
.
ప్రకటనలు

The URI to TrackBack this entry is: https://naagola.wordpress.com/2010/09/20/%e0%b0%93-%e0%b0%aa%e0%b1%8d%e0%b0%b0%e0%b0%bf%e0%b0%af%e0%b1%81%e0%b0%b0%e0%b0%be%e0%b0%b2/trackback/

RSS feed for comments on this post.

16 వ్యాఖ్యలువ్యాఖ్యానించండి

 1. మీరు మంచి భావకుడే అనుకున్నాను,గొప్ప ప్రేమికుడు కూడా అన్న మాట. హృదయాన్ని తాకే కవిత. చాలా బావుంది

  • ధన్యవాదములు ప్రదీప్ గారు

 2. Sir.
  Who is that lucky girl? This can’t just be a poem for sure!

  • మీరు అడిగారు కాబట్టి చెప్పేస్తున్నాను వినయ్…నాది భావుకత్వం నుండి పుట్టిన ప్రేమికత్వం గాని… ప్రేమికత్వం నుండి పుట్టిన భావుకత్వం కాదండి.

 3. ఒహొహో! జవరాల! ఎవ్వతెవీవు, ఈ భావుకుని మదినిండిన ప్రియురాలవు…….

  • ఆహా..ఊహాసుందరిని పేరడిగిన ఏమి సెప్పంగలదు మహాశయా..

 4. చాలా బాగుందండీ మీ కవిత..:)) ముఖ్యంగా…
  >>ఇంత విశాల ప్రపంచంలో మరెక్కడా చోటే లేనట్టు
  ….చిన్నని నా హృదయంలో దూరి
  చాలా నచ్చింది..

  • మీ వ్యాఖ్యకు ధన్యవాదములండి అపర్ణగారు..

 5. అమ్రుతం వంటి ప్రేను నీది

 6. wah waa wah waa!!!!!!!

 7. చాలా బాగా వ్రాసారు
  ఈమధ్య కనపడటం లేదు రాజన్ గారు

  • ధన్యవాదములండి…అవునండి కొద్దిగా విరామం వచ్చిందండి

 8. ఆఖరి లైన్లు బాగున్నై..

  • ధన్యవాదములండి శివ గారు


స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

%d bloggers like this: