.
పుట్టి మనం ఏడుస్తాం
పోయి మనవాళ్లని ఏడిపిస్తాం
పుడుతూ తెచ్చుకున్నదాన్ని
పొతూ ఇచ్చేస్తామన్న మాట
.
నొప్పి కలిగితే ఏడుస్తాం
నవ్వుల పాలైతే ఏడుస్తాం
బాధ దేహానికైనా హృదయానికైనా
ఏడుపే మొదటి ఓదార్పన్న మాట
.
ఎప్పుడు ఏడ్చినా ఎందుకు ఏడ్చినా
కన్నీళ్ళు వస్తాయి…అవి
గుండె బరువు దించడానికి
అందమైన కళ్ళు కడగడానికి అట
.
చుట్టపు చూపుగా వస్తేనే
ఏడుపుకి అందం
చీటికీ మాటికీ వచ్చేస్తే
జీవితానికి నిరాశే బంధం
.
కష్టమొచ్చినా నష్టమొచ్చినా
ముందుగా ఏడ్చేస్తాం…కానీ
ఆ ఏడుపునే ఏడిపించగలిగితే
జీవితాంతం నవ్వేస్తాం
.
ప్రకటనలు
చాలా చాలా బాగుంది.
>>”పుడుతూ తెచ్చుకున్నదాన్ని
పొతూ ఇచ్చేస్తామన్న మాట” ఈ మాటలు హైలైట్.
బాగా చెప్పారు.నిజమే చీటికి మాటికే కాదండోయ్ అత్యంత విలువైన మన కన్నీటిని అర్హత లేని వారి కోసం కూడా అనవసరంగా వెచ్చిస్తే అవసరం ఐనపుడు ఇంకిపోగలవు.
‘కష్టమొచ్చినా నష్టమొచ్చినా
ముందుగా ఏడ్చేస్తాం…కానీ
ఆ ఏడుపునే ఏడిపించగలిగితే
జీవితాంతం నవ్వేస్తాం’
ఈ లైను చాలా చాలా బాగుంది
23 DECEMBER 2008 నుండి 1 JANUARY 2010 దాకా ఏం జరిగిందో తెలుసుకోవాలంటే ఈ బ్లాగు చూడండి..
http://creativekurrodu.blogspot.com/
Happy New Year 🙂
మాధవ్ గారు, మనోశ్రీ గారు, నాగ ప్రసాద్ గారు….మీ అభినందన పూర్వక వ్యాఖ్యలకు ధన్యవాదములండి
భావుకుడి ఏడుపు భాష్యం కోసం
చాప్లిన్ ఏడుపు హాస్యం కోసం
ప్రియురాలి ఏడుపు ప్రియునికోసం
ప్రియుని ఏడుపు ఆమె చిరునవ్వుకోసం
చిన్నారి ఏడుపు ఆటకోసం
కన్నవారి ఏడుపు ఆమె భాట కోసం
రాజన్ ఏడుపు మంచి కవిత కోసం
కవిత ఏడుపు కొంటె కామెంటు కోసం
————————————————
(నష్టంలో….. ఏడుపుకన్నా ఏమున్నది ఆటవిడుపు
కష్టంలో ….. దైర్యం చూపుటకన్నా ఏమున్నది పొద్దుపొడుపు)
వ్యాఖ్య అద్భుతంగా వ్రాసారు ధన్యవాదాలు
శ్రీ రాజన్ గారికి, నమస్కారములు.
కవిత అధ్భుతముగా వున్నది.
భవదీయుడు,
మాధవరావు.
ధన్యవాదములు మాధవరావు గారు
ఆ ఏడుపు నే ఏడిపించగలిగితే జీవితాంతం నవ్వెస్తాం.
చాలా బాగుంది
కృతజ్ఞతలు శ్రీకాంత్ గారు
please new songs e mail