కాలం తెలివైనది. అది ముందుకు సాగుతూ మనిషి ఆలోచనలు మార్చుకుంటూ వెళిపోతుంటుంది. మారిన ఆలోచనల వల్ల అస్తవ్యస్తమైన జీవన విధానంలో పడి మూలుగుతున్న మనిషిని చూసి వినోదిస్తుంటుంది. జవాబుదారీతనం కలిగిన స్వతంత్రుల గుంపుగా ఉండవలసిన సమాజాన్ని, భయస్తులు, బద్ధకస్తులు, ముసుగుమనసు మనుషుల కలయికగా మార్చివేసింది. తప్పించుకు తిరగడం ఈ కాలపు తెలివిగా తీర్మానించబడింది. గొప్పదనం హృదయాన్ని బట్టికాక, సమాజంలో హోదాని బట్టి లెక్క వేయబడుతుంది. దురలవాట్లుగా చెప్పబడేవి ఇప్పుడు సాధారణ అలవాట్లుగా భావించబడుతున్నాయి. సంపద, అధికారం, కీర్తి, సౌఖ్యం జీవిత గమ్యాలుగా మారిపోయాయి. తెల్లని అన్నం వంటి వీటికి, ఆనందం అనే శ్రేష్ఠమయిన కూర కలిపి తిన్నప్పుడే రుచిపుడుతుంది, బలం కలుగుతుంది, సంతృప్తీ మిగులుతుంది.
మనిషి అంతరాత్మకు కాక కేవలం సమాజానికి జవాబుదారీగా మారిపోయాడు. అవతలివారి పొగడ్త మీదో, తోటివారికంటే గొప్పవాడనిపించుకోవడం అనే తపన మీదో ఆధారపడి ఆనందాన్ని కొలుచుకుంటున్నాడు. పదిమందీ ప్రశంసిస్తే కలిగే ఆనందం భయంతో కూడిన బాధ్యతను పెంచుతుంది. క్రొత్త ఆలోచనలకు వారి ప్రశంసాకారణాలు పరిధులుగా ఏర్పడిపోతాయి. ఫలితంగా ఆలోచనల్లో స్వతంత్రత, నూతనత్వం మందగిస్తాయి, ఆనందం నెమ్మది నెమ్మదిగా ఆవిరైపోతుంది. అదే, లోపలి మనిషి ప్రశంస వలన కలిగే ఆనందం స్వతంత్రతతో కూడిన ఉత్సాహాన్నిస్తుంది. సృజనాత్మకతను వికసింపజేస్తుంది. ఆలోచనే ఆనందంగా మారిపోతుంది. కానీ ఈ లోపలి మనిషితో మన బంధం రోజురోజుకీ బలహీనపడిపోతూ ఉంది. మనతో మనం గడపడానికి సమయం కేటాయించుకోలేకపోతున్నాం. మనల్ని మనకు దగ్గరచేసే ఏకాంతం అనేది పుస్తకాల్లో మాటగానే మిగిలిపోతోంది.
సాంస్కృతిక విప్లవం మంచికంటే చేటే ఎక్కువ చేసింది. సంపాదన మీద విపరీతమైన మక్కువ, సమాజంలో ఉన్నతికోసం పడే ఉబలాటం, కుటుంబసభ్యుల మద్య బంధాలని పలుచన చేసింది. భార్యాభర్తల ఉద్యోగాల వల్ల పిల్లలు ఆయాలకు, హాస్టళ్లకు అప్పగించబడుతున్నారు. స్కూలునుండి ఇంటికి రాగానే మంచినీళ్లిచ్చి ప్రేమగా దగ్గరకు తీసుకోవాల్సిన అమ్మ ఇప్పుడు ఆఫీసులో క్షణం తీరిక లేకుండా ఉంటోంది. అమ్మప్రేమ అనే మధురిమ ఒకప్పటి కాలానికి సంబంధించిన మధురభావనగా మిగిలిపోనుంది. భార్యాభర్తలిద్దరూ కలిసి సంపాదించిన డబ్బుతో పిల్లల్ని అన్ని వసతులూ గల హాస్టళ్ళు కలిగిన కార్పొరేట్ స్కూళ్లలో చేర్పిస్తున్నారు. ఆ పిల్లలు పెద్దయ్యాక తల్లితండ్రులను అంతకంటే మంచి పేరున్న వృద్ధాశ్రమాలలో చేర్పించి ఋణం తీర్చుకుంటున్నారు. తాము చిన్నతనంలో నేర్చుకున్న న్యూటన్ మూడవ సూత్రాన్ని తెలియకుండానే అమలు చేస్తున్నారు. ప్రతీ చర్యకూ దానికి అంతే సమానమైన ప్రతిచర్య ఉంటుంది కదా.
ఇప్పటికంటే మన పూర్వతరాలవారే ఎక్కువ శాతం ఆనందంగా ఉన్నారని అంగీకరించగలిగితే, అందుకు కారణమైన వారి అలవాట్లను, జీవన విధానాన్ని వివేచనతో బేరీజు వేసి అవలంబించగలిగితే, ఆనందాన్ని పట్టుకోవడానికి దారి దొరకవచ్చు. కాల పరీక్షకు నిలబడి, తత్వాన్ని మనకు మంచి కథల రూపంలో అందించిన ప్రాచీన సాహిత్యం కచ్చితంగా మనకు సహాయపడుతుంది. అంతరాత్మను వినగలిగే ఏకాంతం మనిషిని ప్రశాంతతకు దగ్గర చేస్తుంది, ఒంటరితనం బారిన పడకుండా కాపాడుతుంది. అలుపెరుగని ప్రయత్నం చేసి అవసరం లేని అలవాట్లను, మన బుద్ధిని తప్పుదారి పట్టించే వ్యక్తులను వదులుకో గలగాలి. మొదట్లో ఇది కష్టంగా అనిపించినా క్రమేణా గొప్ప ఆనందాన్నిస్తుంది. “లేనిదానిని సాధించడం వల్ల కలిగే ఆనందానికి అల్పాయుష్షు; అక్కరలేనిదానిని వదిలించుకోవడం వల్ల కలిగే ఆనందానికి దీర్ఘాయుష్షు.” ’నిన్న’, ’రేపు’ తాళ్లయితే ’నేడు’ ఉయ్యాలబల్ల. గతం యొక్క అనుభవసారాన్ని, భవిష్యత్తు మీద విశ్వాసాన్ని ఆదరువుగా చేసుకుని వర్తమానంలో క్రీడిస్తూ జీవించగలగాలి. నిరంతర గమ్యమయిన ఆనందాన్ని చేరుకోగలగాలి.
******* 7 Star rating for this article.extraordinary post. Great write-up. keep writing Rajan garu.
మీ అభిమానానికి కృతజ్ఞతలండి ప్రదీప్ గారు
అద్భుతంగా రాసారు.
———
“దేనివల్ల శాశ్వత నిష్క్రమణ సమయంలో కూడా దుఃఖం కలుగదో, ఆ వెలకట్టలేని విలువైన విశేషానుభూతి పేరే ఆనందం.”
“గొప్పదనం హృదయాన్ని బట్టికాక, సమాజంలో హోదాని బట్టి లెక్క వేయబడుతుంది.”
“అమ్మప్రేమ అనే మధురిమ ఒకప్పటి కాలానికి సంబంధించిన మధురభావనగా మిగిలిపోనుంది.”
“ఆ పిల్లలు పెద్దయ్యాక తల్లితండ్రులను అంతకంటే మంచి పేరున్న వృద్ధాశ్రమాలలో చేర్పించి ఋణం తీర్చుకుంటున్నారు.”
“తాము చిన్నతనంలో నేర్చుకున్న న్యూటన్ మూడవ సూత్రాన్ని తెలియకుండానే అమలు చేస్తున్నారు.”
ఎంత అందంగా చెప్పారండి.
Once again Super
నిన్న’, ’రేపు’ తాళ్లయితే ’నేడు’ ఉయ్యాలబల్ల. గతం యొక్క అనుభవసారాన్ని, భవిష్యత్తు మీద విశ్వాసాన్ని ఆదరువుగా చేసుకుని వర్తమానంలో క్రీడిస్తూ జీవించగలగాలి.
మీ ప్రోత్సాహపూరితమైన అభిప్రాయానికి ధన్యవాదములండి మదన్ గారు
ఆనందం అంటే అది ఇది అని చాలామంది చెబుతారు. కానీ ఆనందాన్ని ఒక పేజీలో మీరు వివరించిన తీరు మాత్రం అద్భుతం. అసలు నిరంతర గమ్యం అనే శీర్షికే సూపరు. చాలాబాగుందండి.
స్రవంతి
మీ వ్యాఖ్యకు ధన్యవాదములండి స్రవంతి గారు
mee rachana style bavundandi. chala baagaa rasaru.
naaku baagaa nachina points rastunna.
కాలం తెలివైనది. అది ముందుకు సాగుతూ మనిషి ఆలోచనలు మార్చుకుంటూ వెళిపోతుంటుంది.
గొప్పదనం హృదయాన్ని బట్టికాక, సమాజంలో హోదాని బట్టి లెక్క వేయబడుతుంది.
దురలవాట్లుగా చెప్పబడేవి ఇప్పుడు సాధారణ అలవాట్లుగా భావించబడుతున్నాయి.
న్యూటన్ మూడవ సూత్రాన్ని తెలియకుండానే అమలు చేస్తున్నారు.
’నిన్న’, ’రేపు’ తాళ్లయితే ’నేడు’ ఉయ్యాలబల్ల.
అమ్మప్రేమ అనే మధురిమ ఒకప్పటి కాలానికి సంబంధించిన మధురభావనగా మిగిలిపోనుంది.
శిరీష గారు మీ అభిప్రాయాన్ని తెలియజేసిన విధానం చాలా ప్రోత్సాహాన్నిచ్చిందండి. ధన్యవాదములు
Good & Valuable Post.
మీ వ్యాఖ్యకు కృతజ్ఞతలండి కావేరిగారు
ఈ పోస్తులు చదువుతున్తె ఎదో తెలియని ఉస్తహమ్.నేను ఇలనే వునానా అని ఒక మానసిక స0గర్సన.
hi
prathi